వారంలో ఒక్క‌సారి ఈ ప్యాక్ వేసుకుంటే హెయిర్ ఫాల్‌కు టాటా చెప్పొచ్చు!

హెయిర్ ఫాల్.దాదాపు అందర్నీ వేధించే సమస్య అయినప్పటికీ కొందరిలో ఇది చాలా తీవ్రంగా ఉంటుంది.

దాని వల్ల ఒత్తైన జుట్టు కాస్త పల్చగా మారిపోతుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో కనుక ఉంటే అస్సలు వ‌ర్రీ అవ్వకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ ను వారంలో ఒక్కసారి వేసుకుంటే కనుక జుట్టు రాలడానికి టాటా చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ హెయిర్ ప్యాక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక అవ‌కాడోను తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన అవ‌కాడోను సగానికి కట్ చేసి గింజను తొలగించి పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ అవకాడో ప‌ల్ప్ ను మెత్తగా స్మాష్ చేసుకోవాలి.స్మాష్ చేసుకున్న అవ‌కాడో మిశ్ర‌మంలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మయోన్నైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధ‌రించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

"""/"/ వారంలో ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే కుదుళ్లు బలంగా మరియు హెల్తీ గా మారతాయి.

దాంతో జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు చిట్లడం, పొట్లి పోవడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తెల్ల జుట్టు సైతం త్వరగా రాకుండా ఉంటుంది.కాబట్టి, హెయిర్ ఫాల్ ను అడ్డుకునేందుకే కాకుండా ఇతర ప్రయోజనాలు పొందేందుకు సైతం ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవచ్చు.