ఈ రెండిటిని నెలకు ఒకసారి తలకు రాశారంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు!
TeluguStop.com
తెల్ల జుట్టు.( White Hair ) ప్రస్తుత రోజుల్లో చాలా మంది అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి.
వయసు పైబడిన వారే కాదు వయసులో ఉన్న వారికి కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది.
తలలో వైట్ హెయిర్ కనిపించడం ఆలస్యం.అప్పుడే వృద్ధాప్యం వచ్చేసిందా అన్న దిగులు మొదలవుతుంది.
తమ తెల్ల జుట్టును చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అన్న ఆందోళన వెంటాడుతుంది.
ఈ క్రమంలోనే తెల్ల జుట్టును దాచేయడానికి నానా తంటాలు పడుతుంటారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం.
అందుకు ఉసిరి( Amla ) మరియు మందారం( Hibiscus ) ఎంతగానో సహాయపడతాయి.
ఇవి రెండు జుట్టు సంరక్షణకు మద్దతు ఇస్తాయి.విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగి ఉండే ఉసిరి జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, తెల్ల జుట్టును అడ్డుకోవడంలో తోడ్పడుతుంది.
అలాగే మందారం పువ్వులు కూడా వైట్ హెయిర్ కు చెక్ పెట్టడానికి హెల్ప్ చేస్తాయి.
"""/" /
ఉసిరి, మందారం కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా నెలకు ఒకసారి తలకు రాశారంటే తెల్ల జుట్టు మీ వంక కూడా చూడదు.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్ మరియు మూడు టేబుల్ స్పూన్లు మందారం పౌడర్ వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
కనీసం నెలకు ఒకసారి ఈ హెయిర్ మాస్క్ ను వేసుకుంటే తెల్ల జుట్టు సమస్యకు దూరంగా ఉండవచ్చు.
అదే సమయంలో జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.
హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు దట్టంగా సైతం పెరుగుతుంది.
ఆ బ్రాండ్ కార్లపై టాలీవుడ్ మోజు.. నాగ్ కొత్త కారు ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?