బీజేపీ సీటు కోసం దరఖాస్తు విధానం ! చివరి తేదీ ఎప్పుడంటే ?

తెలంగాణ బిజెపి( Telangana BJP ) కూడా కాంగ్రెస్ బాట పట్టింది.ఎప్పుడూ లేనివిధంగా పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు కోరాలని నిర్ణయించింది.

ఇప్పటికే కాంగ్రెస్ ఇదే విధంగా దరఖాస్తులు ఆహ్వానించి అభ్యర్థుల ఎంపిక సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టింది.

మరికొద్ది రోజుల్లోనే తన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా,  బిజెపి కూడా అదే బాట పట్టింది.

బిజెపి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావాహులు పోటీ పడుతుండడంతో,  దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

ఈనెల నాలుగో తేదీ ఉదయం 10 గంటల నుంచి,  10వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ దరఖాస్తులను స్వీకరించనున్నారు.

"""/" /  ఇదే విషయం పై బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి( Gujjula Premender Reddy ) ఈ ప్రకటనను విడుదల చేశారు.

నిన్న కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారట.

శాసనసభ ఎన్నికలకు సంబంధించి బిఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది.కాంగ్రెస్( Congress Party ) కూడా దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేసిన నేపథ్యంలో బిజెపి కూడా ఇదేవిధంగా దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను మరికొద్ది రోజుల్లోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది .

"""/" / వాస్తవంగా జులై నెలాఖరు నాటికి మూడో వంతు నాయకులకు టికెట్లు ప్రకటించాలని బిజెపి నిర్ణయించుకున్నా,  అది సాధ్యం కాలేదు.

దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.అయితే జాతీయ నాయకత్వం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిర్ణయం తీసుకునేందుకు అనుమతించడంతో ,  నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ బిజెపి నిర్ణయించింది.

  ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి… కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు