సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి దరఖాస్తు – నారాయణపూర్ నమిలికొండ శ్రీకాంత్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి బిజెపి నుండి అవకాశం కల్పించాలని దరఖాస్తు చేసుకున్న నమిలికొండ శ్రీకాంత్ ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన నమిలికొండ శ్రీకాంత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముస్తాబాద్ మాజీ జెడ్పిటిసి సభ్యులు మట్ట వెంకటేశ్వర్ రెడ్డితో డాక్టర్ ఉమా శంకర్ ను కలిసి
సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ గురించి దరఖాస్తును అందజేశాడు.
ఎల్లారెడ్డిపేట మండలంలో భారతీయ జనతా పార్టీలో కొంతకాలం చురుకైన వ్యక్తిగా కొనసాగి అనంతరం హైదరాబాదులో నివసిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నాడు.తనకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
వైరల్ వీడియో: అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్