మరొకరి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. ఎలాగంటే..
TeluguStop.com
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనుషుల ప్రాణాలు చివరి నిమిషాల్లో రక్షించబడుతున్నాయి.ఈ మధ్యకాలంలో స్మార్ట్‌వాచ్‌లు చాలామంది ప్రాణాలను కాపాడుతూ అందరి చేత పొగిడించుకుంటున్నాయి.
ముఖ్యంగా యాపిల్ వాచ్( Apple Watch ) వారి ఆరోగ్య సమస్యల గురించి వారిని హెచ్చరించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడుతూ వార్తల్లో నిలుస్తోంది.
ఈ స్మార్ట్ వాచ్ చాలా సందర్భాలలో ప్రాణ రక్షణిగా నిలిచింది.తాజాగా ఇది మరొకరి ప్రాణాలను నిలబెట్టింది.
"""/" /
క్లీవ్‌ల్యాండ్‌కు( Cleveland ) చెందిన ఒక వ్యక్తి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించడం ద్వారా అతని ప్రాణాలను రక్షించడంలో యాపిల్ వాచ్ సహాయపడింది.
నిద్ర, వ్యాయామ సెషన్‌ల వంటి అతని ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడానికి కెన్ కౌనిహన్( Ken Counihan ) అనే వ్యక్తి ఒక యాపిల్ వాచ్‌ని కొనుగోలు చేశాడు.
వాచ్‌లో అతని శ్వాస బాగా పెరిగినప్పుడు అతను అప్రమత్తమయ్యాడు, కానీ అతను అది కేవలం చిన్న అనారోగ్యమే అని భావించాడు.
అయితే, అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయినప్పుడు, ఆసుపత్రికి వెళ్లమని ఆపిల్ వాచ్ పదే పదే హెచ్చరించింది.
"""/" /
దాంతో వెంటనే అతను ఆసుపత్రికి వెళ్ళాడు.కొన్ని స్కాన్‌లు చేసిన తర్వాత, కౌనిహన్‌కు ఊపిరితిత్తులపై రక్తం గడ్డకట్టినట్లు కనుగొనబడింది, ఇది ప్రాణాపాయ స్థితి.
కౌనిహన్ ఆసుపత్రికి వెళ్లకుండా పడుకుని ఉంటే, మరుసటి రోజు ఉదయం ప్రాణాలే పోయిండేవని ఒక డాక్టర్ చెప్పారు.
కౌనిహన్ యాపిల్ వాచ్ అతని శ్వాస, రక్త ఆక్సిజన్ స్థాయిల గురించి అతన్ని హెచ్చరించింది, తద్వారా అతను సకాలంలో వైద్య సంరక్షణను పొందేందుకు వీలు కల్పించింది.
ఈ స్మార్ట్ వాచ్ చాలా మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది.ఈ సంగతి తెలిసిన నెటిజన్లు "వావ్, యాపిల్ వాచ్ యువర్ గ్రేట్" అంటూ కామెంట్ చేస్తున్నారు.
నిత్యం ఈ టీ తాగితే నిద్రలేమి, అధిక బరువుతో సహా ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసా?