స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి.. యాపిల్ వాచ్ నెక్స్ట్ ఏం చేసిందో తెలిస్తే..

యాపిల్ ఐఫోన్స్ మాత్రమే కాకుండా యాపిల్ స్మార్ట్‌వాచ్‌లు( Apple Smartwatch ) కూడా లైఫ్ సేవర్లుగా నిలుస్తున్నాయి.

ఇప్పటికే చాలామంది ప్రాణాలను కాపాడిన స్మార్ట్‌వాచ్లు ఇప్పుడు మరొకరి లైఫ్ సేవ్ చేశాయి.

వివరాల్లోకి వెళ్తే, రీసెంట్‌గా యూఎస్‌కి చెందిన జోష్ ఫర్మాన్( Josh Furman ) అనే 40 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోయింది.

దాంతో స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు, తలకు గాయం అయింది.అతడికి టైప్ 1 డయాబెటిస్( Type 1 Diabetes ) ఉంది.

అదృష్టవశాత్తూ, అతను ఆ సమయంలో యాపిల్ వాచ్ ధరించి ఉన్నాడు, అది అతను స్పృహ తప్పి పడిపోవడాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా 911కి కాల్ చేసింది.

జోష్ ఎమర్జెన్సీ సర్వీస్ ఆపరేటర్‌తో మాట్లాడలేకపోయాడు, కానీ వాచ్ అతని GPS లొకేషన్ పంపింది.

వాచీ తన అత్యవసర కాంటాక్ట్ అయిన అతని తల్లికి కూడా తెలియజేసింది.ఆమె జోష్ వైద్య పరిస్థితి గురించి ఆపరేటర్‌కు చెప్పింది, ఇది అతనికి చికిత్స చేయడానికి పారామెడిక్స్‌కు( Paramedics ) సహాయపడింది.

"""/" / తన యాపిల్ వాచ్( Apple Watch ) తన ప్రాణాలను కాపాడిందని జోష్ చెప్పాడు.

ఫాల్ డిటెక్షన్, హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ షుగర్ ట్రాకింగ్ వంటి వాటి ఫీచర్స్ ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలని అతను ఇతరులకు సలహా ఇచ్చాడు.

చాలా మందికి, ముఖ్యంగా వృద్ధులకు తమ ఐఫోన్‌లలో ఈ ఫీచర్లను ఎలా యాక్టివేట్ చేయాలో తెలియకపోవచ్చని ఆయన అన్నారు.

"""/" / జోష్ కథ ఒక్కటే కాదు.వేల్స్‌కు చెందిన సీఈఓ అయిన పాల్ వాపమ్ కూడా తన యాపిల్ వాచ్‌కి ధన్యవాదాలు చెప్పాడు, పరిగెత్తేటప్పుడు ఇతను ఛాతీ నొప్పితో బాధపడ్డాడు ఆ సమయంలో అతడు కాల్ చేయలేకపోయాడు కానీ భార్యకు ఫోన్ చేయడానికి వాచ్‌ను సహాయపడింది.

ఆ విధంగా అతను సకాలంలో వైద్య సహాయం పొందాడు.

చిరంజీవికి ఆ ఫుడ్ అంటే అంత ఇష్టమా.. ఏంటో తెలుసా?