అందర్నీ మెప్పిస్తున్న యాపిల్ వీడియో చాట్ రియాక్షన్స్.. ఎలా వాడాలో తెలుసుకోండి..

టెక్ దిగ్గజం యాపిల్( Apple ) రీసెంట్‌గా ఐఓఎస్ 17, ఐపాడ్ఓఎస్ 17, మ్యాక్ఓఎస్ సోనోమా వంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

ఫేస్‌టైమ్, వాట్సాప్ వంటి యాప్‌లలో వీడియో కాల్‌ల సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యులకు వీడియో రియాక్షన్లను పంపడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

వీడియో కాల్ ఫీడ్‌లో కనిపించే 3D యానిమేషన్లు, బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్‌లను ట్రిగ్గర్ చేయడానికి యూజర్లు విభిన్న హ్యాండ్ గెస్చర్స్ చేయాల్సి ఉంటుంది.

ఈ రియాక్షన్లతో వీడియో కాల్‌ల సమయంలో ఫీలింగ్స్, మూడ్స్‌ను మరింత ఆహ్లాదకరమైన, ఎక్స్‌ప్రెస్సివ్ మార్గాల్లో కమ్యూనికేట్ చేయవచ్చు.

ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, యాపిల్ డివైజ్‌ను లేటెస్ట్ ఓఎస్‌కి అప్‌డేట్ చేయాలి.ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్ అయి వస్తుంది, కాబట్టి ఆన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

ఫేస్‌టైమ్, వాట్సాప్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మద్దతు ఇచ్చే యాప్‌లలో రియాక్షన్ల ఫీచర్‌ని వినియోగించవచ్చు.

మీరు ఉపయోగించగల కొన్ని వీడియో రియాక్షన్లు, వాటిని ఎలా ట్రిగ్గర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / - ఫైర్ వర్క్స్: ఈ ఎఫెక్ట్ వీడియో కాల్ సమయంలో యూజర్ వెనుక మిరుమిట్లు గొలిపే బాణాసంచా ప్రదర్శన కనిపిస్తుంది.

దీన్ని ట్రిగ్గర్ చేయడానికి, కెమెరాకు చేతివేళ్లతో డబుల్ థంబ్స్-అప్ సైన్ చూపించాలి.- హార్ట్స్: ఈ ఎఫెక్ట్ మీ చుట్టూ హార్ట్ ఎమోజీలను( Heart Emojis ) ప్రదర్శిస్తుంది.

దీన్ని ట్రిగ్గర్ చేయడానికి, రెండు చేతులతో హార్ట్ షేప్ తయారు చేసి కెమెరాకు చూపించాలి.

"""/" / - థంబ్స్ అప్ & థంబ్స్ డౌన్: ఈ ఎఫెక్ట్స్‌ యూజర్ ముఖం పక్కన ఒక సాధారణ థంబ్స్-అప్ లేదా థంబ్స్-డౌన్( Thumbs-up Or Thumbs-down ) బబుల్‌ను చూపుతాయి.

వాటిని ట్రిగ్గర్ చేయడానికి, కెమెరాకు థంబ్స్-అప్ లేదా థంబ్స్-డౌన్ గెస్చర్ చూపాలి. """/" / - కన్ఫెట్టి లేదా బెలూన్స్: ఈ ఎఫెక్ట్స్‌ స్క్రీన్ పై నుంచి పడే కన్ఫెట్టి లేదా బెలూన్‌లతో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తాయి.

వాటిని ట్రిగ్గర్ చేయడానికి, వేళ్లతో రెండు విక్టరీ సైన్స్ తయారు చేయాలి. """/" / - వర్షం: ఈ ఎఫెక్ట్స్‌ వెనుక వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తుంది.

దీన్ని ట్రిగ్గర్ చేయడానికి, రెండు బొటనవేళ్లను కింది వైపుకు చూపించాలి.