యూజర్లకి షాకిచ్చిన Apple… బాంబులా పేలిన స్మార్ట్ వాచ్!
TeluguStop.com
Apple అంటేనే ఓ పాపులర్ బ్రాండ్.నాణ్యమైన స్మార్ట్ ఫోన్లకి, స్మార్ట్ వాచ్ లకి పెట్టింది పేరు.
ఈ కంపెనీ వినియోగదారుల నమ్మకానికి అనుగుణంగానే వస్తువుల నాణ్యతలో రాజీలేకుండా అలాగే ధరలలో కూడా వెనక్కి తగ్గకుండా దశాబ్దకాలానికి పైగానే రాజ్యమేలుతోంది.
అయితే తాజాగా అదే Apple కంపెనీ వినియోగదారులకు ఓ షాక్ ఇచ్చింది.బహుశా వారు కూడా ఇది ఊహించి ఉండరేమో.
అవును, అమెరికాలో ఒక యాపిల్ స్మార్ట్ వాచ్ యూజర్ కి ఈ చేదు అనుభవం ఎదురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి.
ముందుగా స్మార్ట్ వాచ్ వేడెక్కుతున్నట్టు గ్రహించిన యూజర్.వెంటనే ఆ విషయాన్ని యాపిల్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి చెప్పాడు.
యూజర్ ఇచ్చిన ఫిర్యాదుతో యాపిల్ టీమ్ ఆ ప్రాబ్లెమ్ పైన ఫోకస్ చేసింది.
కానీ ఆ మరునాడే ఊహించని పరిణామం జరిగింది.సదరు యూజర్ ఉదయం నిద్ర లేచిచూసేసరికి.
ఉపయోగించకుండా పక్కన పెట్టిన స్మార్ట్ వాచ్ బ్యాటరీ ఉబ్బినట్టుగా, లావుగా తయారవడమే కాకుండా స్క్రీన్ పగిలిపోయి దాని నుండి శబ్ధాలు రావడం మొదలయ్యాయి.
దీంతో ఏదో ఊహించని ఉపద్రవం ఎదురవబోతోందని గ్రహించిన సదరు స్మార్ట్ వాచ్ యూజర్.
వెంటనే దానిని కిటికీలోంచి బయటకు విసిరేశాడు. """/"/
దాంతో ఆ వాచ్ ఢామ్మని పేలిపోయింది.
కాగా ఈ విషయాన్ని సదరు యూజర్ యాపిల్ కంపెనీకి తెలియజేశాడు.అయితే, ఆ విషయాన్ని గోప్యంగా దాచిపెట్టాల్సిందిగా చెప్పిన యాపిల్ కంపెనీ.
ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేయమని కోరింది.అంతేకాకుండా ఆ వాచ్‌ని ల్యాబ్‌లో టెస్టింగ్ కోసం పికప్ బాయ్‌ని అరేంజ్ చేసి పికప్ చేసుకోనున్నట్టు తెలిపింది.
అయితే, ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచి డాక్యుమెంట్‌పై సంతకం చేయాలన్న యాపిల్ విజ్ఞప్తిని మాత్రం సున్నితంగా తిరస్కరించిన యూజర్.
ఈ విషయాన్ని ఇలా బహిర్గతం చేశాడు.అయితే ఆ సో కాల్డ్ కంపెనీ ఆ విషయాన్ని గోప్యంగా ఎందుకు ఉంచమందో వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా!.
ట్రంప్ రెచ్చిపోతే .. అమెరికాపై భారీ సుంకాలు, కెనడా కసరత్తు