జిడ్డు చ‌ర్మాన్ని నివారించే యాపిల్ తొక్క‌లు..ఎలాగంటే?

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది జిడ్డు చ‌ర్మంతో నానా తిప్పలు ప‌డుతున్నారు.

ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.మ‌ళ్లీ కొన్ని క్ష‌ణాల‌కే చ‌ర్మం జిడ్డుగా మారిపోతుంది.

అందుకే వీరు మేక‌ప్ వేసుకోవాల‌న్నా, బ‌య‌ట‌కు వెళ్లాల‌న్నా తెగ భ‌య‌ప‌డ‌తారు.అయితే జిడ్డు చ‌ర్మం బాధితుల‌కు యాపిల్ తొక్క‌లు అద్భుతంగా స‌హయ‌ప‌డ‌తాయి.

చ‌ర్మంపై అద‌న‌పు జిడ్డును తొలిగించి.ముఖాన్ని తాజాగా, అందంగా మెరిపించ‌డంలో యాపిల్ తొక్క‌లు గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రియు యాపిల్ తొక్క‌ల‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా యాపిల్ తొక్క‌ల‌ను శుభ్రం చేసుకుని ఎండపెట్టి పొడి చేసుకోవాలి.

ఇప్పుడు ఈ యాపిల్ తొక్క‌ల పొడిలో ఓట్స్ పొడి మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు పూసుకుని.ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక సారి చేస్తే.చ‌ర్మంలో నుంచి అధిక జిడ్డు ఉత్ప‌త్తి కాకుండా ఉంటుంది.

దాంతో మీరు ఫ్రెష్‌గా క‌నిపిస్తారు.అలాగే యాపిల్ తొక్క‌లను మెత్త‌గా పేస్ట్ చేసి.

అందులో కొద్దిగా ప‌సుపు వేసి బాగా క‌లుపు కోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు అప్లై చేసి.

పావు గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల నూనె గ్రంథులు మూసుకుని.చ‌ర్మం బిగుతుగా మారుతుంది.

యాపిల్ తొక్క‌లను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఈ పొడిలో చిటికెడు బేకింగ్ సోడా మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి.ప‌ది నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా చ‌ర్మం జిడ్డుగా మార‌డం త‌గ్గి.కాంతివంతంగా మెరుస్తుంది.

వైరల్ వీడియో: అసలు ఆడదానివేనా నువ్వు.. మొగుడ్ని అంతలా చిత్రహింసలు పెడతారా..