ఆ మోడల్ ఐఫోన్ వాడేవారికి ఆపిల్ ఉచిత సర్వీస్..!
TeluguStop.com
మొబైల్ రంగంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన సంస్థలలో ఆపిల్ కంపనీది మొదటి స్థానం.
అయితే ఆపిల్ ఫోన్ వాడే వినియోగదారులకు ఆపిల్ కంపనీ ఒక శుభవార్త అందించనుంది.వినియోగదారులు కోరిక మేరకు ఆపిల్ సంస్థ కొత్తగా సర్వీస్ ప్రొగ్రామ్ ని స్టార్ట్ చేసింది.
అయితే ఈ సర్వీస్ కేవలం ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో ఉపయోగించే వినియాగదారులకు మాత్రమే అంట.
మిగతా ఐఫోన్ సీరీస్ లకు మాత్రం వర్తించదు.ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో వినియోగించే వినియోగదారులు ఫోన్ మాట్లాడే సమయంలో కొన్ని ఫోన్ సౌండ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిసింది.
అది కూడా మరి పెద్ద శబ్దాలు అయితే కావుకాని చాలా కొద్ది పర్సెంటేజ్ లో మాత్రమే డిస్టర్బన్స్ వస్తుందని చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేసారు.
అసలు ఈ సమస్య తలెత్తడానికి కారణం ఏంటంటే రిసీవర్ మోడల్ లోని కాంపోనెంట్స్ పనితీరు సాఫీగా లేకపోవడం వలన ఇలా సౌండ్ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు ఆపిల్ సంస్థ తెలిపింది.
అయితే గత సంవత్సరం అక్టోబర్ 2020,ఈ సంవత్సరం ఏప్రిల్ 2021 మధ్యలో తయారైన ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో ఫోన్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్టు గుర్తించామని ఆ సంస్థ తెలిపింది.
అందుకనే ప్రస్తుతం ఈ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులకు ఉచితంగా సర్వీస్ ఆప్షన్ అందుబాటులోకి తెస్తున్నామని ఆపిల్ యాజమాన్యం తెలిపింది.
ఐఫోన్12, ఐఫోన్12 ప్రో వాడే వారు ఫోన్ చేసినప్పుడు గాని లేదంటే ఫోన్ వచ్చినప్పుడు గాను ఏదన్నా సౌండ్ కు సంబంధిత సమస్యలు వస్తే వెంటనే ఆపిల్ మొబైల్ ఫ్రీ సర్వీస్ అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
"""/"/
ఈ ఫ్రీ సర్వీస్ అనేది ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఫోన్ లకు వర్తించదు.
ఎందుకంటే ఆ ఫోన్లలో ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవని ఆ సంస్థ తెలిపింది.
ఎవరైతే ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో యూజర్లు మీకు దగ్గరగా ఉన్న యాపిల్ రీటైల్ సెంటర్‌కు వెళ్లి ఫ్రీ సర్వీస్ చేయించుకోవచ్చని సూచించారు.
అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సర్వీస్ సెంటర్ కి వెళ్లాలని సూచించారు.అంతేకాకుండా ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో రిపైర్ సర్వీస్ చేయించుకున్నవారు మరో రెండేళ్లపాటు సర్వీస్ కవరేజ్ కూడా అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
ఒకవేళ మీరు కూడా ఐఫోన్ 12,ఐఫోన్ 12 ప్రో ఫోన్లు వాడుతున్నట్లయితే ఈ ఫ్రీ సర్వీస్ ను ఉపయోగించుకోండి మరి.
రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?