బీజింగ్‌లో పర్యటించిన యాపిల్ సీఈవో.. చైనాపై ప్రశంసలు

ప్రముఖ బ్రాండెడ్ ఫోన్ యాపిల్ ఐఫోన్లను చైనాలో తయారు చేస్తారనే విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో యాపిల్ CEO టిమ్ కుక్( Tim Cook ) శనివారం చైనాలో పర్యటించారు.

చైనా డెవలప్‌మెంట్ ఫోరమ్‌కు హాజరయ్యేందుకు కుక్ బీజింగ్‌లో ఉన్నారు.గత ఏడాది చివర్లో చైనాలో కోవిడ్ తగ్గిన తర్వాత చైనా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహిస్తోంది.

టిమ్ కుక్‌తో పాటు, ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఫైజర్, బిహెచ్‌పి వంటి సంస్థల సిఇఒలు కూడా హాజరయ్యారు.

ఈ తరుణంలో చైనాపై టిమ్ కుక్ ప్రశంసలు కురిపించారు."చైనాలో ఇన్నోవేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

భవిష్యత్‌లో ఇది మరింత వేగవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను" అని కుక్ పేర్కొన్నారు.

తన ప్రసంగంలో యువత ప్రోగ్రామింగ్, క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని టిమ్ కుక్ సూచించారు.

చైనాలో గ్రామీణ విద్యా కార్యక్రమంపై తాము అందించే సాయాన్ని 100 మిలియన్ యువాన్లకు పెంచాలని ఆయన యోచిస్తున్నట్లు స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి.

"""/" / చైనా-అమెరికా( America ) మధ్య ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ సమయంలో చైనాలో తమ ఐఫోన్ల ఉత్పత్తిని తగ్గించాలని యాపిల్ సంస్థ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

చైనా నుంచి క్రమంగా ఉత్పత్తిని తగ్గించి, భారతదేశం( India ) వంటి ఇతర దేశాల్లో కేంద్రాలకు ఉత్పత్తిని తరలించాలని చూస్తున్న సమయంలో టిమ్ కుక్ ఈ పర్యటన చేపట్టారు.

దీంతో ఆయన పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.గత సంవత్సరం, చైనా జీరో-COVID విధానాలు కార్మికుల అశాంతికి ఆజ్యం పోశాయి.

"""/" / పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి.ఈ క్రమంలో Apple కంపెనీ సరఫరాదారు ఫాక్స్‌కాన్ నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇక చైనా పర్యటనలో ఉన్న టిమ్ కుక్ బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్‌ను కూడా సందర్శించారు.

ఈ ఫొటోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈసారి సెమీస్ కి వెళ్లే టీమ్ లపై క్లారిటీ రావడం లేదా..?