ఆపిల్ నుంచి సరికొత్త సర్వీసులు మీకోసం..!

ఈ కాలంలో చాలా మంది డబ్బులకు బదులు ఆన్లైన్ పేమెంట్స్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది.

అలాగే ఒకవేళ ఏదైనా కొనడానికి డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా కూడా డబ్బులు తీసుకుని తరువాత మెల్లగా అప్పు కట్టేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం ఆయన ఆపిల్ కంపెనీ నుంచి ఒక కొత్త పేమెంట్ సర్వీసు అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుంది.

అదే " ఆపిల్ పే లేటర్ " సర్వీస్.పేరు వింటేనే మీకు ఈ సర్వీస్ గురించి తెలిసిపోయి ఉంటుంది.

ఆపిల్ పే యూజర్ల కోసం ఈ Buy Now Pay Later (BNPL) అనే కొత్త సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ సర్వీసు ద్వారా మీకు నచ్చిన ఏదైనా ఒక ప్రొడక్ట్ గాని వస్తువు కొనుకోవచ్చు.

ఒక్కసారిగా డబ్బులు చెల్లించాలిసిన పని లేదు. """/"/ ఆన్ లైన్ ఇన్స్టాల్మెంట్సు లో కూడా పేమెంట్ చేసుకోవచ్చు.

ఈ సర్వీసు కనుక పూర్తిగా అందబాటులోకి వచ్చిందంటే ఇంకా అన్నీ స్టోర్స్ లో పేమెంట్ అనేది చేసుకోవచ్చు.

అలాగే ఈ సర్వీసు రెండు రకాలుగా మనకి ఉపయోగపడుతుంది.మొదటిది ఏంటంటే మీరు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే డబ్బులు ముందుగా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకా రెండోది మీరు కొనుగోలు చేసిన వస్తువుపై రెండు నెలల్లో వడ్డీ లేకుండా నాలుగు సార్లు పేమెంట్స్ చేసుకోవచ్చు అన్నమాట.

ఒకవేళ Applay Pay యూజర్లకు క్రెడిట్ కార్డు ఉంటే దాని ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు.

అలాగే మీ పేమెంట్ పిరియడ్ మీకు నచ్చిన నెలలకు పెంచుకోవచ్చు.కానీ వడ్డీ అయితే చెల్లించాల్సి ఉంటుంది.

లాంగ్ టెర్మ్ ప్లాన్లపై మాత్రమే వడ్డీ ఉంటుంది.షార్ట్ టర్మ్ ప్లాన్స్ లో వడ్డీ ఉండదు.

అలాగే పేమెంట్ ప్లాన్లు, లేట్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉంటాయి.అయితే చార్జెస్ ఎంత పడతాయి ఏంటి అనే విషయాలు తెలియాలంటే.

ఈ కొత్త పేమెంట్ సర్వీసు అందుబాటులోకి వస్తే గాని తెలియదు.అయితే ఈ సర్వీస్ పై ఆపిల్ అధికారికంగా స్పందించలేదు.

మరి కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మాత్రం టెక్ నిపుణులు తెలుపతున్నారు.

షాకింగ్ వీడియో: విద్యుత్ వైర్లతో మృత్యువుతో గేమ్స్ ఆడుతున్న యువకుడు..