గోల్కొండ కోటలో అప్పన్నపేట డప్పు మోత

సూర్యాపేట జిల్లా: ఈ నెల 15 రాష్ట్ర రాజధాని గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అమరవరపు సతీష్ మాస్టర్ మహిళా డప్పు కళా బృందం కళాకారులు ప్రపంచానికి తమ డప్పు దరువును వినపించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం తరపున తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ సహకారంతో అందె మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అందె భాస్కర్ సౌజన్యంతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో డప్పు ప్రదర్శనకు అవకాశం రావడం సంతోషకరమన్నారు.

మహిళలు డప్పులు కొట్టడం,అది కూడా పల్లెటూరు నుండి రాష్ట్ర రాజధానిలో డప్పు కొట్టడం ఆనందంగా ఉందని మాస్టర్ అమరవరపు సతీష్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

గోల్కొండ కోటలో పాల్గొనే డప్పు కళాకారులు అందరూ హుజుర్ నగర్ నియోజకవర్గానికి చెందిన వారే కావడం సంతోషంగా ఉన్నదని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

రజినీకాంత్ యంగ్ డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటి..?