ముందస్తు పై లీకులిస్తున్న అప్పలరాజు ?

ఏపీలో జగన్ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు .2024 వరకు కొనసాగేందుకు అవసరమైన సంపూర్ణ మెజారిటీ ఉంది.

175 స్థానాలకు గాను 151 స్థానాలను ఆ పార్టీ 2019లో గెల్చుకుంది.దీంతోపాటు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం జనాలకు అందిస్తోంది.

అక్కడక్కడ కాస్త వ్యతిరేకత కనిపించినా, కొన్ని వర్గాల ప్రజల్లో జగన్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నా,  2024 ఎన్నికల్లోను విజయానికి ఎటువంటి డొఖా ఉండదమే సర్వే నివేదికలు బయటకు వస్తున్నాయి .

టిడిపి , జనసేన పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదిరే అవకాశం కనిపించకపోవడం,  వైసీపీకి మరింత కలిసి వచ్చే అంశం.

అయినా షెడ్యూల్ కంటే ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి.

      దీనికి తగ్గట్లుగానే జగన్ కూడా ముందస్తుగానే హడావుడి మొదలుపెట్టారు.గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైసిపి ఎమ్మెల్యేలు,  మంత్రులు, కీలక నాయకులు,  అధికారులు జనాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇదంతా ముందస్తు ఎన్నికల కోసమే అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ కు సన్నిహితుడుగా ముద్రపడిన మంత్రి సిదిరి అప్పలరాజు ముందస్తు ఎన్నికలకు సంబంధించి లీకులు ఇస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు వైసీపీ ఎక్కడా అధికారికంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించలేదు.కానీ దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నట్లుగానే సంకేతాలు ఇస్తోంది.

    """/"/    దీనిలో భాగంగానే మంత్రి అప్పలరాజు మాటలు ఉన్నాయి.పలాసలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి అప్పలరాజు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని , కనుక అంతా సిద్ధంగా ఉండాలంటూ మాట్లాడడం సంచలనం కలిగించింది.

మనం ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు.దీంతో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో చేస్తున్న కార్యక్రమం ఎన్నికల ప్రచారంలో భాగంగానేనా అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది.

     .

ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ విలనా..? లేదంటే ప్రభాస్ కి హెల్ప్ చేసే క్యారెక్టరా..?