ఇండస్ట్రీలోని ఆడవాళ్లంటే ఎవడితోనైనా అలా చేసిందని అనుకుంటారు.. నా కోడలికి సినిమాలొద్దని అన్నానంటూ?

ప్రముఖ టాలీవుడ్( Tollywood ) నటుడు అప్పాజీ అంబరీష( Appaji Ambarisha ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

నా భార్య నిమ్స్ లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ అని మా ఫాదర్ దగ్గర మ్యారేజ్ అయిన తర్వాత ఏడాది ఉన్నానని ఆయన తెలిపారు.

ఆ తర్వాత కెరీర్ ను ఛాలెంజ్ గా తీసుకుని ఇంట్లోనుంచి బయటకు వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.

నాన్న కార్ యాక్సిడెంట్ లో చనిపోయారని అప్పాజీ అంబరీష తెలిపారు.యాప్స్ గురించి ఎవరికీ తెలియని సమయంలో నేను యాప్స్ కోసం వర్క్ చేశానని అప్పాజీ అంబరీష కామెంట్లు చేశారు.

నా భార్య పీజీ చేయకపోయినా జాబ్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.నా భార్యకు మొదట వేతనం తక్కువగా ఉండేదని అప్పాజీ అంబరీష వెల్లడించారు.

మాకు ఒక్కడే బాబు అని అప్పాజీ అంబరీష తెలిపారు.నా కోడలికి సినిమా ఫీల్డ్ అంటే ఎంతో ఆసక్తి ఉండేదని అయన వెల్లడించారు.

"""/" / ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నా కోడలికి ( Daughter-in-law )చెప్పానని సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే చిన్నచూపు ఉంటుందని అన్నానని ఆయన కామెంట్లు చేశారు.

సినిమా రంగానికి చెందిన వాళ్లు అంటే బయటి వాళ్లకు సైతం చిన్నచూపు ఉంటుందని అప్పాజీ అంబరీష పేర్కొన్నారు.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) ఉంటుందని, శృంగారం కోసం వేధిస్తారని ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు.

"""/" / సినిమా ఇండస్ట్రీలో అవి లేనని నేను చెప్పనని సినిమా ఇండస్ట్రీలో చేసేవాళ్లకు క్యారెక్టర్ ఉండదని ఎవరితోనైనా పడుకుంటుందని అనుకుంటారని అప్పాజీ అంబరీష కామెంట్లు చేశారు.

హీరోయిన్లు పెట్టే పోస్ట్ లకు ఏ స్థాయిలో నెగిటివ్ కామెంట్లు ఉంటాయో చెప్పలేమని అప్పాజీ అంబరీష అన్నారు.

అప్పాజీ అంబరీష వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఉషా చిలుకూరి వాన్స్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు