ఏపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం..!!

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలమైన పార్టీ.కానీ ఎప్పుడైతే రాష్ట్రని ఇష్టానుసారంగా విభజన చేయడం జరిగిందో అప్పటినుండి కాంగ్రెస్ కనుమరుగైపోయింది.

ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పార్టీ పుంజుకునే రీతిలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది.

ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున కార్గే ఎన్నికైన తర్వాత.ఏపీసీసీ నూతన ఏర్పాటు చేయడం జరిగింది.

దీనిలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షుడుగా గిడుగు రుద్రరాజు నియమితులైయ్యారు. """/"/ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా జంగా గౌతమ్, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిని నియమించారు.

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ గా పల్లంరాజు, ప్రచార కమిటీ చైర్మన్ గా జివి హర్షకుమార్, మీడియా, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని నియమించారు.

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

తక్షణమే ఈ నియామక ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 33 మందితో కోఆర్డినేషన్ కమిటీని నియమించాడం జరిగింది.

శివాజీ పాత్ర పోషిస్తూ కొడుక్కి హిందూ వ్యతిరేకి పేరు.. యాక్టర్‌ను ఏకిపారేస్తున్నారుగా..??