వర్మ వ్యూహం సినిమా టీజర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు
TeluguStop.com
వ్యూహం సినిమా టీజర్ పై స్పందించి రామ్ గోపాల్ వర్మ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు .
వ్యూహం సినిమాలో కాంగ్రెస్ నాయకత్వాన్ని గాని సోనియాగాంధీని గాని అవమానించేలా చిత్రీకరిస్తే రాంగోపాల్ వర్మ బట్టలూడదీసి కొడతామని ఏపీ సి సి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అనంతపురంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ అనే వ్యక్తి ఎప్పుడు బ్యాలెన్స్ ద్ పర్సన్ కాదని, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడమే ఆయన నైజం అన్నారు.
జరిగిన వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.జగన్ కేసులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.
రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు గాంధీ కుటుంబ సభ్యుల కాలిగోటికి కూడా సరిపోరని తప్పుబట్టారు.
దేశ ప్రజలను సొంత బిడ్డల్లా భావించే వ్యక్తిత్వం సోనియా గాంధీది అన్నారు.వారికి స్వార్థ ప్రయోజనాలే ఉంటే 2004లోనే సోనియా గాంధీ ప్రధాని అయి ఉండేవారని,రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మన్మోహన్ సింగ్ వయోభారంతో ప్రధానిగా ఉండాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినా తిరస్కరించారని పేర్కొన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీపై చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని , కాంగ్రెస్ పార్టీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఎంతో చేసిందన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఆయన రెండోసారి సీఎం అయ్యాక రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు.
ఆయన కలను సాకారం చేయడం కోసం మనందరం ఐక్యంగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?