రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యం – వైఎస్ షర్మిలా

తిరుపతి జిల్లా: శ్రీకాళహస్తిలో భారీ బహిరంగ సభ.ఎన్నికల ప్రచారంలో బాగంగా సభలో పాల్గొన్న PCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.

APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కామెంట్స్.శ్రీకాళహస్తి ఎంఎల్ఏ మధుసూదన్ రెడ్డి ఎప్పుడైనా పనికి వచ్చాడా ? పొద్దున ఒకరిని అడిగా మీ ఎంఎల్ఏ ఎలా ఉన్నాడు అని ? వసూలు రాజ అని చెప్పారు.

ఒక్క పని చేయడు అని చెప్పారు.మొత్తం మట్టి మాఫియా,ఇసుక మాఫియా.

కబ్జాల రాజ అంట కదా.ఎంఎల్ఏ టాక్స్ కట్టాలట కదా.

ఈయన దెబ్బకు పరిశ్రమలు అన్ని మూసుకొని పోతున్నారట.ఈయనే మళ్ళీ టిక్కెట్ ఇచ్చారట.

మళ్ళీ దోచుకో అని చెప్పాడట.ఓటు అడగడానికి మళ్ళీ వస్తాడు.

డబ్బులు బాగా ఇస్తాడట.ఎంత ఇచ్చినా తీసుకోండి.

దంచి వసూలు చేయండి.ఓటు వేసే టప్పుడు ఆలోచన చేయండి.

ఆలోచన లేకుండా ఓటు వేస్తే మీ బిడ్డలను బానిసలను చేసినట్లే.5 ఏళ్లు వైసిపి కి అధికారం ఇస్తే ఏం చేశారు.

రాష్టానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంది.గతంలో చంద్రబాబు,ఇప్పుడు జగన్ మోసం చేశారు.

పాలక పక్షం,ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ కి బానిసలు గా మారారు.హోదా ఇస్తామని ఎందుకు మోసం చేశారు అని బీజేపీ నీ అడగలేదు.

రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు.అటు హైదరాబాద్,ఇటు బెంగళూర్,ఒక వైపు చెన్నై.

మన రాష్ట్రం రాజధాని ఏంటి? రాష్ట్రంలో నిత్యావసర ధరలు బాగా పెంచారు.ఒకవైపు డబ్బులు ఇస్తూనే,మరోవైపు గుంజుకుంటున్నారు.

బటన్ నొక్కండం అంటే బహుశా ఇదే.రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది.

2.30లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు.

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు.మెగా Dsc వేస్తామని చెప్పారు.

అధికారంలో వచ్చాక మెగా Dsc లేదు.జాబ్ క్యాలెండర్ లేదు.

ఎన్నికల ముందు కుంభకర్ణుడి లెక్క నిద్ర లేచాడు.ఇప్పుడు నోటిఫికేషన్ అంటూ హడావిడి చేస్తున్నాడు.

రాష్ట్రానికి హోదా కావాలి అంతే కాంగ్రెస్ అధికారంలో రావాలి.10 ఏళ్లు హోదా ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది.

కాంగ్రెస్ అధికారంలో వస్తె 2 లక్షల రుణమాఫీ చేస్తాం.ప్రతి పేద మహిళలకు ఏడాదికి లక్ష సహాయం.

ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల తో పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం.

రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ కాంగ్రెస్ తోనే సాధ్యం.

చూడగానే కన్నీళ్లు వచ్చాయి.. దండం పెట్టేసిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!