కొత్త టీమ్ తో షర్మిల సిద్ధం … జిల్లాల వారీగా అధ్యక్షులు వీరే
TeluguStop.com
తెలంగాణలో మాదిరిగానే ఏపీలోను కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( APCC Chief YS Sharmila ) ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఒప్పించి మరీ ప్రత్యేకంగా తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ మేరకు ఏపీలో తనతో కలిసి పని చేసేందుకు ప్రత్యేకంగా కొంత మందితో పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీ అధిష్టానం పెద్దల వద్దకు తీసుకువెళ్లి మరి ఆమోద ముద్ర వేయించుకున్నారు.
షర్మిల టీమ్ పై పార్టీలోనే కొన్ని విమర్శలు వ్యక్తమైనా, అవేమీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
పూర్తిస్థాయిలో తనుకు అనుకూలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా , """/" /
భవిష్యత్తులోనూ తనకు ఇబ్బందులు ఉండవని, అసంతృప్తులకు తావుండదని షర్మిల అధిష్టానం పెద్దలను ఒప్పించి మరీ ఆమోదముద్ర వేయించుకున్నారు.
వీరిలో ఎక్కువగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులుగా మెలిగిన వారే చాలామంది ఉన్నారు.
మొత్తంగా 25 జిల్లాలకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు.13 మందికి రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షులు, 37 మందికి ప్రధాన కార్యదర్శులు, 10 మందికి నగర పార్టీ అధ్యక్షులు గా షర్మిల అవకాశం ఇచ్చారు.
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) ముగిసిన తర్వాత షర్మిల పై ఆరోపణలు చేసిన కొంతమంది నాయకులను పక్కన పెట్టారు.
సుంకర పద్మశ్రీ , మాజీ మంత్రులు సాకే శైలజానాథ్ వంటి వారికి కమిటీలు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
"""/" /
H3 Class=subheader-styleజిల్లాల వారిగా కాంగ్రెస్ అధ్యక్షులు /h3p
శ్రీకాకుళం అంబటి కృష్ణారావు,( Ambati Krishnarao ) విజయనగరం మరిపి విద్యాసాగర్,( Maripi Vidyasagar ) విశాఖపట్నం వెంకట వర్మ రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా సాతాక బుల్లిబాబు , అనకాపల్లి మీసాల సుబ్బన్న, కాకినాడ మద్దేపల్లి సత్యానంద రావు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొండేటి చిట్టిబాబు, తూర్పుగోదావరి విశ్వేశ్వర్ రెడ్డి, పశ్చిమగోదావరి జిల్లా హరికుమార్ రాజు, ఏలూరు రాజనాల రామ్మోహన్ రావు, కృష్ణాజిల్లా గొల్లు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బొర్రా కిరణ్, గుంటూరు చిలక విజయ్, బాపట్ల ఆమంచి కృష్ణమోహన్ , పల్నాడు అలెక్స్ సుధాకర్, ప్రకాశం షేక్ సైదా, నంద్యాల జంగేటి లక్ష్మీ నరసింహ యాదవ్, కర్నూలు పరిగెల మురళీకృష్ణ, అనంతపురం మధుసూదన్ రెడ్డి, కడప విజయ జ్యోతి, శ్రీ సత్య సాయి జిల్లా హినయ్ తుల్లా, నెల్లూరు జిల్లా చేవూరు దేవకుమార్ రెడ్డి, తిరుపతి బాల గురువం బాబు, చిత్తూరు పోటుగారి భాస్కర్.
పుష్ప 2 విడుదల… బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ?