AP PCC Chief Sharmila : రేపటి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల జిల్లాల పర్యటన

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) జిల్లాల పర్యటనకు ముహుర్తం ఖరారు అయింది.

ఈ మేరకు ఆమె రేపటి నుంచి జిల్లాల పర్యటకు( Districts Tour ) వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ షర్మిల రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ కు( DGP Rajendranath ) లేఖ రాశారు.

జిల్లాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు బాపట్లలో పర్యటించనున్న వైఎస్ షర్మిల అక్కడ కాంగ్రెస్ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

"""/" / ఎల్లుండి తెనాలిలో రచ్చబండ( Tenali Rachabanda ) నిర్వహించనున్నారు.ఈనెల 8వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభలో పాల్గొననున్నారు.

ఈనెల 9న కొవ్వూరు, తుని నియోజకవర్గంలో సభలకు షర్మిల హాజరుకానున్నారు.ఈనెల 10న నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గంలో మరియు 11న నగరి నియోజకవర్గంలో షర్మిల బహిరంగ సభలను నిర్వహించనున్నారు.