తులసి మొక్కే కాకుండా ఇంట్లో.. ఈ మొక్క ఉంటే కూడా మంచిదే..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) ఎంతో బలంగా నమ్ముతారు.

ఇంకా చెప్పాలంటే వారి ఇంటి నిర్మాణాలను కూడా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు.

ఎందుకంటే వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచి జరుగుతుందని, ఎటువంటి సమస్యలు ఉండవని చాలా మంది ప్రజలు భావిస్తారు.

పైగా వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుంచి దూరంగా వెళ్లిపోతుందని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో దాదాపు చాలా మంది ఇళ్ల లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది.

తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి ( Goddess Lakshmi )ఉన్నట్లే అని చాలామంది ప్రజలు భావిస్తారు.

అంతే కాకుండా తులసి మొక్క నెగిటివ్ ఎనర్జీ ని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.

అయితే తులసి మొక్క ఎలా అయితే ఇంట్లో ఉండాలో అలానే జమ్మి మొక్క కూడా ఉండాలని పండితులు చెబుతున్నారు.

"""/" / దీని వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఎంతో మంచి జరుగుతుందని, అలానే ఇంటికి ఐశ్వర్యం వస్తుందని చెబుతున్నారు.

అయితే జమ్మి మొక్క ను ప్రతి రోజు మనం పూజించడం అసలు మర్చిపోకూడదు.

అంతే కాకుండా ఇంట్లో జమ్మి, తులసి మొక్కల కు రోజు పూజలు చేస్తూ ఉండాలి.

తులసి మొక్కని ఎలా అయితే కొలుస్తామో అలానే జమ్మి మొక్కను కూడా కొలవాలి.

ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ప్రతిరోజు చేయడం వల్ల బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.

అంతే కాకుండా పెళ్లి అవ్వక చాలా మంది బాధపడుతూ ఉంటారు.అలాంటి వారికి కూడా జమ్మి పరిష్కారాన్ని చూపిస్తుంది.

కాబట్టి తులసి మొక్కనే కాకుండా ఈ జమ్మి మొక్కని కూడా ఇంట్లో ఉంచుకుంటే సమస్యలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు.

వామ్మో, దానంతటదే కదులుతున్న పెయింటింగ్.. దెయ్యాలు నిజంగానే ఉన్నాయా..??