అపాచీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం..!
TeluguStop.com
అపాచీ హెలికాప్టర్‌కు పెను ప్రమాదం తప్పింది.భారత వాయుసేనకు చెందిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.
వెంటనే గుర్తించి అప్రమత్తమైన పైలట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బిహింద్ దగ్గర ఓ గ్రామ సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది.హెలికాప్టర్‌లోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.
అనంతరం మరో హెలికాప్టర్ లో సిబ్బందిని తరలించారు.