డీజీపీకి ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ లేఖ
TeluguStop.com
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్ వేదికగా కొన్ని పోస్టులు షేర్ చేశారు.
మొదటి పోస్టులో ఐటమ్ వంటి పదాలు వాడిని వారికి జైలు శిక్షలు పడుతున్న రోజులివి.
అన్ని పార్టీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిదని చెప్పారు.రెండో పోస్టులు డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
స్పెషల్ టీంలతో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలని తెలిపారు.అనంతరం డీజీపీకి లేఖను రాశారు.
అయితే, ఇటీవల మహిళలను కించపరుస్తూ కొందరు రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని పార్టీ నేతలను ఆమె హెచ్చరించారు.
అల్లు అర్జున్ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడా..?