ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలసిన టీడీపీ నేతలు.. !

తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా నిర్వహించిన రోడ్ షో లో కలకలం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

తిరుపతి గాంధీ రోడ్డులో చంద్రబాబు ప్రచార సభను నిర్వహిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వడం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా తీవ్రంగా స్పందించిన టీడీపీ నేతలు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుని గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన సంగతి తెలిసిందే.

అంతే కాకుండా ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేసిందట.

ఈ క్రమంలో ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ ‌కుమార్‌ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిసి ఫిర్యాదు చేశారని సమాచారం.

ఈ సందర్భంగా తిరుపతిలో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని టీడీపీ ఎంపీలు ఆరోపించారట.

అదీగాక తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పోలింగ్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో జరగాలని ఎంపీలు కోరుతున్నారట.

కష్టపడి అలసిపోయిన సురేఖ.. దుబాయ్ ట్రిప్ తీసుకెళ్లిన మెగాస్టార్?