పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేసిన టీడీపీ..!!

నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిషత్ ఎన్నికలకు రెడీ అవటం పట్ల విమర్శలు వస్తున్నాయి.

అధికార పార్టీకి అనుకూలంగా ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బాయ్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

అక్రమాలు జరిగినా ఎన్నికలనే.ఎన్నికల కమిషన్ కొనసాగించడాని తప్పుబడుతూ.

పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు టిడిపి పేర్కొంది.బలవంతపు మరియు బెదిరింపు ఏకగ్రీవాలు పై చర్యలు తీసుకోకుండా ఈ విధంగా వాటిని కొనసాగిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి తప్పుబట్టిన చంద్రబాబు పోలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయం కఠినమైన గాని తప్పదు అంటూ పేర్కొన్నారు.స్థానిక ఎన్నికలు అప్రజాస్వామికంగా తయారయ్యాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు.

అంతే కాకుండా పరిషత్ ఎన్నికల తేదీలు ముందే ఎలా డిసైడ్ చేస్తారు అంటూ ప్రశ్నించారు.

రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలను సపోర్ట్ చేయము అన్నట్టు చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.

ఠాగూర్ సినిమా వల్ల డాక్టర్ల బ్రతుకులు నాశనం.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!