ఏపీ విద్యార్థులకు అగ్రరాజ్యం పిలుపు.. నానోటెక్నాలజీ సదస్సుకు రావాలని ఆహ్వానం

ఏపీలో వైఎస్ జగన్ పాలన వచ్చిన తరువాత విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులను వివరించడంతో పాటు అంతర్జాతీయ మేధావుల దృష్టిని సైతం మనబడి పిల్లలు ఆకర్షించిన విషయం తెలిసిందే.

పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగించి ఎందరో మేధావులను ఆకట్టుకున్న మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేశవిదేశ విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఈ తరహాలోనే తాజాగా మనబడి పిల్లలకు మరో అరుదైన ఆహ్వానం లభించింది.వైట్ హౌస్ కు రావాలంటూ అగ్రరాజ్యం అమెరికా ఇన్విటేషన్ ఇచ్చింది.

మార్చి 5, 2024లో అమెరికాలో నానో టెక్నాలజీ సదస్సు జరగనుంది.కాగా ఈ సదస్సుకు హాజరుకావాల్సిందిగా మన విద్యార్థులకు ఆహ్వానం అందింది.

ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, వ్యోమగాములతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారు, భారత సంతతికి చెందిన ఆర్తి ప్రభాకర్ తో మన స్టూడెంట్స్ ఆ వేదికపై మాట్లాడే ఛాన్స్ వచ్చింది.

ఆప్టిక్స్, విద్య, వైద్యం, ఉత్పత్తి, తయారీ రంగాలతో పాటు మైక్రో ఎలక్ట్రానిక్స్ వంటి పలు అంశాలపై విద్యార్థులు అక్కడ ప్రసంగిచనున్నారు.

అయితే ఏపీ విద్యావ్యవస్థలో సంస్కరణలు మొదలైనప్పటి నుంచి విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలు.ఆ ఫలితాలకు అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు దక్కడం ఇదేమీ తొలిసారి కాదు.

గత సెప్టెంబర్ నెలలో అమెరికాలో సుస్థిర అభివృద్ధి అనే అంశం మీద జరిగిన అంతర్జాతీయ సదస్సులో మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఆయా దేశాల ప్రతినిధులతో కలిసి అక్కడి పాలనా విధానాలు, విద్య, ఆరోగ్యం వంటి పలు కీలక అంశాలపై అక్కడి ప్రభుత్వాలు పెడుతున్న శ్రద్ధ, సమాజ అభివృద్ధిలో ఆయా రంగాలు ఎలాంటి కీలక పాత్ర పోషిస్తాయనే అంశాలపై చర్చలు నిర్వహించారు.

అలాగే పలువురు విద్యావేత్తలు, ఆర్థిక, సామాజిక వేత్తలతోనూ భేటీలు నిర్వహించారు.పదిమంది విద్యార్థులు సుమారు పదిహేను రోజులపాటు కొలంబియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలతో పాటు న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం, ప్రపంచ బ్యాంకును సైతం సందర్శించారు.

ఈ క్రమంలోనే ఏపీ విద్యారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులతో పాటు అందుకోసం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలు, చర్యలను వివరించారు.

రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కోసం జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి, మనబడి నాడు -నేడు, విద్యాకానుక వంటి పథకాలు విద్యావ్యవస్థను ఎంతలా బలోపేతం చేసిందనే విషయాన్ని కూడా అక్కడి ప్రతినిధులను మన విద్యార్థులు వివరించారు.

దాంతో పాటు మన వైసీపీ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించి మేధావులు, విద్యావేత్తల మెప్పు పొందారు.

ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం నుంచి సదస్సుకు పిలుపు రావడాన్ని బట్టే మన వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలకు మరో గుర్తింపు వచ్చినట్లేనని ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించిందంటే దానికి కారణం జగన్ సర్కార్ చేస్తున్న చర్యలే కారణమని కొనియాడుతున్నారు.

ఫ్లోరిడా హైస్కూల్లో అద్భుత ఘటన.. ఒకేసారి అంతమంది కవలలు పట్టా పొందారు..??