సర్కార్ మెడలు వంచిన సర్పంచులు

నిజానికి గ్రామ సర్పంచ్( Sarpanch ) అంటే ఆ గ్రామ ప్రజలకు నాయకుడు.

ఆ గ్రామంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడిగా గుర్తించవచ్చు .

ఎందుకంటే అక్కడ జరిగిన స్థానిక ఎన్నికలలో మెజారిటీ ప్రజలు మన్ననల్ని పొందగలిగిన వ్యక్తి కాబట్టి ఒక గ్రామానికి రిప్రజెంటేటివ్ గా చెప్పవచ్చు.

అలాంటి సర్పంచ్లకు వైసీపీ సర్కార్( YCP ) తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వారికి సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆ వ్యవస్థ ద్వారా చేయడం ద్వారా గ్రామపంచాయతీలు చాలా చోట్ల డమ్మీలుగా మిగిలిపోయాయి.

ముఖ్యంగా సచివాలయ వ్యవస్థకు బ్యాక్అప్ గా పంచాయతీ వ్యవస్థ పని చేస్తుంది.తప్ప నేడు పంచాయతీలు చేస్తున్న ప్రత్యక్ష కార్యాచరణ ఏమీ లేదు.

"""/" / అంతేకాకుండా కేంద్రం ద్వారా పంచాయతీలకు( Gram Panchayat ) వస్తున్న నిధులను కూడా ప్రభుత్వం వివిధ అవసరాల కోసం వాడుకోవడంతో మౌలిక వసతులు కల్పనకు కూడా డబ్బులు లేక పంచాయతీలు సర్పంచులు చాలా కాలంగా రోడ్లు ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు.

నిన్న మొన్నటి వరకు ప్రతి పక్ష పార్టీల సర్పంచులు మాత్రమే పోరాటాలు చేస్తే గత కొన్ని రోజులుగా వైసిపి పార్టీ మద్దత్తు తో గెలిచిన సర్పంచులు కూడా రోడ్ల ఎక్కడంతో విషయం తీవ్ర రూపం దాల్చింది.

ముఖ్యంగా వివిధ రూపాలలో తమ ఆందోళనలు నిర్వహించిన సర్పంచులు ఎక్కడికక్కడ ప్రభుత్వం పై తమ అసంతృప్తిని తెలియజేస్తూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తూ తమ సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం గా చేయడంతో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని గ్రహించిన సర్కార్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.

"""/" / తరలించిన పంచాయతీలు నిధులను ఒక్కొక్కటిగా తిరిగి జమ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది దాంతో ప్రబుత్వం పై సర్పంచుల పోరాటం విజయవంతమైనట్లుగా చెప్పవచ్చు.

ఈ నిధులతో తిరిగి తమ గ్రామాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకుంటామని, ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుంటామని సర్పంచులు చెబుతున్నారు.

సంఘటితంగా పోరాటం చేస్తే విజయం సాధించవచ్చు అనడానికి సర్పంచుల ఐక్య పోరాటమే ఉదాహరణ గా చెప్పవచ్చు అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే ప్రభుత్వం దిగి రావడానికి ప్రధాన కారణం మరి కొన్ని నెలల్లో ఎన్నికలు( AP Elections ) ఉన్నందున, గ్రామం మొత్తాన్ని ప్రభావితం చేయగల సర్పంచులతో సున్నం పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావాలని భావించిన సర్కార్ కేవలం ఎన్నికలకు బయపడి నిధులు రిలీజ్ చేస్తుంది తప్ప పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

మహేష్ బాబు బాలయ్య కాంబో లో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా..?