అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ సర్కార్ !
TeluguStop.com
కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ నుండి దశల వారీగా సడలింపులు ఇస్తూ వస్తుంది.
ఈ మద్యే కేంద్రం ఆన్ లాక్ 5.0 కి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇక తాజాగా లాక్ డౌన్ నుండి ఇంకా కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీలో అన్ లాక్ 5.
0 మార్గదర్శకాలు విడుదల చేశారు.అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్రం ఇటీవల ఇచ్చిన సడలింపులతో జనజీవనం దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది.
అంతర్జాతీయ విమాన సర్వీసులు, పూర్తిస్థాయిలో రైళ్లు తిరగడం తప్పించి అన్ని అంశాలు ప్రజలకు అందుబాటులోకి విధిగా వచ్చేస్తున్నాయి.
ముఖ్యంగా ప్రజలు అతి పెద్ద రిలీఫ్ గా భావించే ప్రధాన వినోదమైన సినిమా కూడా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
మరోవారంలో సినిమా హాళ్లు కూడా తెరుచుకోనున్నాయి.ఈ క్రమంలో ఏపీ సర్కారు అక్టోబరు 15 నుంచి అమల్లోకి వచ్చేలా తాజా మరికొన్ని మార్గదర్శకాలు వెల్లడించింది.
ఆ వివరాల్ని ఒకసారి చూస్తే .సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, దుకాణాల వద్ద శానిటైజర్లు తప్పనిసరి.
మాస్కు లేనివారికి ప్రవేశం నిషేధం.రద్దీగా ఉండే ప్రదేశాల్లో విధిగా భౌతికదూరం పాటించాలి.
బస్సులు, ఇతర రవాణా వాహనాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.ప్రార్థనా మందిరాల్లో కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఖచ్చితంగా పేస్ మాస్కులు ధరించాలంటూ మైక్ ల ద్వారా ప్రచారం చేయాలనీ చెప్పారు.
కరోనా నిబంధనల అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.సినిమా థియేటర్లతో కరోనా నివారణపై టెలీ ఫిల్మ్ ద్వారా ప్రచారం.
స్కూళ్లు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో కేంద్రం మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలి.పాఠశాలల్లో ప్రతి పీరియడ్ తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు శానిటైజేషన్ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
కాగా , ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కరోనా నివారణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిపారు.
Slot 10: Kundensupport Und Servicequalität Für Spieler In DE