అభివృద్ధి వర్సెస్ అరాచకం ! ఏపీ రాజకీయం మామూలుగా లేదు
TeluguStop.com
ఏపీలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసిపి , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య పొలిటికల్ వార్ వాడివేడిగా జరుగుతుంది.
మళ్ళీ రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే జగన్ కసరత్తు చేయడంతో పాటు, ప్రజాబలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాము పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని , అవే తమరు మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాయి అనే నమ్మకంతో జగన్ ఉండగా, ప్రజల్లో ప్రభుత్వం తీరుపై ఆగ్రహం పెరిగిపోయిందని, మొదట్లో ఉన్నంత సానుకూలత వైసిపి ప్రభుత్వంపై ఇప్పుడు లేదని టిడిపి నమ్ముతోంది.
ఇదే తమను అధికారంలోకి తీసుకొస్తుంది అనే అతి నమ్మకం టిడిపిలో ఉంది.దీనిని మరింత పెంచి ఏపీ ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విధంగా తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం తో టిడిపి పెద్దఎత్తున విమర్శల దాడి మొదలు పెట్టింది.
దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో పాటు, రాబోయే ఎన్నికల వరకు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైసిపి పై మరింత వ్యతిరేకత జనాల్లో పెరిగే విధంగా చేయాలని టిడిపి భావిస్తుంది.
"""/" /
అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తప్పుపడుతూ ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
ఇవే కాకుండా ఏపీలో నెలకొన్న వివిధ సమస్యల పైన ఏపీ వ్యాప్తంగా పోరాటాలు చేయడంతో పాటు, ఏదో ఒక అంశంతో నిత్యం జనాల్లో ఉండేలా టిడిపి ప్రయత్నిస్తుండగా , దీనికి దీటుగా వైసిపి కూడా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు వరకు అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి ప్రచార రూపంలో తీసుకువెళ్లాలని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో జగన్ ఉన్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు ఏపీలో అరాచక పాలన అంటూ హడావుడి చేస్తుండగా, వైసీపీ మాత్రం అభివృద్ధి మంత్రాన్నే నమ్ముకుంది.
సీనియర్ హీరోలతో సినిమాలు చేసిన ఏకైక డైరెక్టర్ గా అనిల్ రావిపూడి నిలుస్తాడా..?