కోనసీమ లో పరిస్థితి చక్కబడినట్టేనా ?

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం పై మొదలైన వివాదం చివరకు మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటి దహనంతో పాటు, కోనసీమ ప్రాంతంలో అశాంతి వాతావరణం నెలకొనడానికి కారణమైంది.

ఇందులో వివిధ రాజకీయ పార్టీల వైఖరి కూడా ఈ వ్యవహారానికి ప్రధాన కారణం.

కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలు కాస్త ఉద్రిక్తత పెంచడానికి కారణమయ్యాయి.

మంత్రి, ఎమ్మెల్యే ఇంటి దహనం తరవాత పోలీసులు పూర్తిగా కోనసీమ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఐపిఎస్ అధికారులను ప్రాంతాలవారీగా ఇంచార్జిలుగా నియమించారు.

ఇక ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.ఇప్పటికే దాదాపు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, 200 మంది వరకు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు గా తేల్చారు.

మరో వెయ్యి మంది వరకు ఉన్నట్లు తేలడంతో వారు ఎవరు అనే విషయాన్ని ఆరా తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఈ ఘటన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు.పూర్తిగా ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేస్తున్నారు.

కొత్త వారు ఎవరు కాకుండా చూస్తూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల నివాసాలకు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.

"""/"/ అల్లవరం మండలం మగాళ్ళం ఊరిలో ఉంటున్న చింత అనురాధ, నగరంలో ఉంటున్న పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, కత్తిమండ లో ఉంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు చెందిన ఇళ్లకు భద్రతను పెంచారు.

అలాగే రావులపాలెం మండలం గోపాలపురం లో నివాసం ఉంటున్న ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి ఇంటికి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.

కోనసీమ ప్రాంతంలో ఎక్కడా అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకోకుండా పోలీసులు అన్ని రకాల వస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లుగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు.. ఎవరంటే?