ఆయన జాతకమే మా వద్ద ఉంది

ఏపీ పోలీసులు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ తెలుగు దేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశాడు.

అధికార పార్టీకి మద్దతుగా ఉంటున్న ఏపీ పోలీసు అధికారుల జాతకాలు తమ వద్ద ఉన్నాయంటూ ఆయన హెచ్చరించాడు.

అధికారం శాస్వతం కాదని, ఎప్పుడు అధికారం ఒక్కరి వద్దే ఉండదనే విషయాన్ని గుర్తించాలంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు సీరియస్‌గా హెచ్చరించారు.

వర్ల రామయ్య కామెంట్స్‌కు పోలీసు సంఘం వారు ఘటుగా స్పందించారు.ఈ సందర్బంగా పోలీసు సంఘం నాయకులు మాట్లాడుతూ మా జాతకాలు కాదు ఆయన జాతకం మా వద్ద ఉందన్నారు.

ఆయన నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.పోలీసులను కించపర్చే విధంగా మాట్లాడటం టీడీపీ నాయకులకు ఫ్యాషన్‌ అయ్యిందని వారు అన్నారు.

రాజకీయాలకు పోలీసులు అతీతులని, పోలీసులు ఎవరికి తల వంచదని ఈ సందర్బంగా పోలీసులు అన్నారు.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!