ఏపీలో మందు రేట్లు ఎక్కువని పోలీసులే ఏకంగా… 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా మందు లేక అల్లాడుతున్నటువంటి మందుబాబులు ఒక్కసారిగా మందు దుకాణాల ముందు క్యూ కట్టారు.

కాగా ఈ మద్యం అమ్మకాలకి అడ్డుకట్ట వేసేందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.

ఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం ఎమ్మార్పీ ధరలపై  దాదాపు 75 శాతం పెంచారు.

అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మద్యం అమ్మకాలు జోరు తగ్గడం లేదు.అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం మద్యం రేటు అధికంగా ఉండడం మరియు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో కొందరు మధ్యాహ్నం సేవించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

అయితే ఇదే అదునుగా చేసుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకొని విక్రయిస్తూ ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు.

ఇలా మధ్యాన్ని దిగుమతి చేసుకుంటూ అక్రమంగా విక్రయిస్తున్న వారిలో తాజాగా విజయవాడ పరిసర ప్రాంతాలకి చెందినటువంటి ఇద్దరు పోలీసులను ప్రభుత్వ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో వారి నుంచి పెద్ద మొత్తంలో మద్యాన్ని కూడా ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ విషయాన్ని తమ పై అధికారులకు తెలపగా ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ అడ్డదారుల్లో పనిచేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి పోలీసులపై ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 .

రేపు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల