పరారీలో చంద్రబాబు పీఎస్ ? మెమో జారీ
TeluguStop.com
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో( Skill Development Scam ) ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టు కాగా, ఈ కేసులో మరిన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు అన్ని సంపాదించిన సిఐడి , ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ గుర్తించి విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ కాగానే, ఆయన పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్( Pendyala Srinivas ) అమెరికాకు పరారీ కావడంపై సిఐడి సీరియస్ గా తీసుకుంది.
అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు పరారీ కావడంతో వారం రోజుల్లోగా స్పందించి సంజాయిషీ ఇవ్వాలని ప్రణాళిక శాఖ మెమో జారీ చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో విచారించేందుకు పెండ్యాల శ్రీనివాస్ కు సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు ఇవ్వగా, ఆయన విదేశాలకు పరారీ అయ్యారు.
"""/" /
ఈ కేసులో ఆయనే కీలక వ్యక్తిగా సిఐడి( CID ) అనుమానం వ్యక్తం చేస్తుంది.
ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు విదేశాలకు పరారీ కావడంతో సిఐడి ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారికి నోటీసులు జారీ చేసింది.
చంద్రబాబు పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు వెళ్లినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు.ఇక అనేక కాంట్రాక్టుల్లో షాపూర్ జి పల్లొంజి కంపెనీకి ప్రతినిధిగా పనిచేసిన మనోజ్ వాసుదేవ్( Manoj Vasudev ) కూడా సెప్టెంబర్ 5న దేశం విడిచి దుబాయ్ కు పరారయ్యారు.
"""/" /
వీరిని వెనక్కి పిలిపించి విచారణ చేసి ఈ కేసులో మరింత పురోగతి సాధించాలనే లక్ష్యంతో సీఐడీ ఉంది.
మొత్తంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, ఈ కేసు తో సంబంధం ఉన్న వారందరినీ విచారించి జైలుకి పంపించాలనే పట్టుదలతో సీఐడీ అధికారులు ఉన్నారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారం తర్వాత సిఐడి తో పాటు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు విమర్శలతో విరుచుకు పడుతున్నా.
ఏపీ ప్రభుత్వం మాత్రం.అత్యంత.
ప్రతిష్టాత్మకంగా ఈ కేసుని చూస్తోంది.
నెట్ ఫ్లిక్స్ లో చైతన్య శోభిత వెడ్డింగ్… స్ట్రీమింగ్ రైట్స్ ఎంతనో తెలుసా?