ఈసీ అధికారులను కలిసిన ఏపీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు

ఏపీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లారు.ఈ క్రమంలో విఠపు బాలసుబ్రహ్మణ్యం, నరసింహా రెడ్డి, షేక్ సాబ్జీలు ఈసీ అధికారులను కలిశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు అధికారులకు ఫిర్యాదు చేశారు.ఏపీలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల ఓటర్ల నమోదులో అవకతవకలను ఎన్నికల అధికారులకు వివరించామని ఎమ్మెల్సీలు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి ప్రతి అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

అదేవిధంగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు.ఓటర్ల లిస్ట్ వచ్చే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.

Super Slots (UK) — An Analytical Look At The Games, Banking And Trade-offs