ఏపీలో ప్రతిపక్షాలకు ఆ ఓటర్లే దిక్కు?

రాష్ట్రంలో వైసిపి ఆధిపత్యానికి తెరదించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు వైసిపి పెద్దగా అభివృద్ధి చేయకపోయినా.

జనాల్లో వారి మంత్రులకు, ఎమ్మెల్యేలకు అంత గొప్ప పేరు లేకపోయినా 175 స్థానాలు జగన్ కు ఊరికే రాలేదు.

మొత్తానికి రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టి మరీ జగన్ ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.

సంక్షేమ పథకాలన్నీ కచ్చితంగా పేదలకు ఉండేలాగా చేయడమే అతనికి పెద్ద ప్లస్ పాయింట్ గా మారనుంది.

జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పథకాలన్నీ పరిశీలిస్తే అవన్నీ పేదలకు అందుతున్నాయి.బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ఒక రకమైన మేలు జరుగుతోంది.

ఇక టిడిపి జనసేన వంటి పార్టీలు అమ్మఒడి, చేయూత, ఇతర పథకాలను మేము కూడా ఇస్తామని లేదంటే అంతకుమించి ఇస్తామని తప్ప వారి ఓట్లు వీరికి వైపుకి వెళ్ళే అవకాశం లేదు.

అయితే ప్రస్తుతం రాష్ట్ర ఖజానా ఉన్న స్థితిలో వారు అంత ధైర్యం కోసం చేయకపోవచ్చు.

కాబట్టి పేదలు, మహిళల ఓట్లన్నీ దాదాపు వైసీపీ వైపే వెళ్ళిపోతాయి.ఇక ప్రతిపక్షం వారు టార్గెట్ చేయాల్సింది మధ్యతరగతి వారు ఓట్లు.

వాళ్లే రోడ్లు బాగోలేదని, ధరలు పెరిగిపోయాయని, పన్నులు పెరిగిపోయాయని, ఉద్యోగాలు రావట్లేదని తెగ గగ్గోలు పెడుతున్నారు వీరికి సహజంగానే ప్రభుత్వంపై పీకలదాకా కోపం ఉంది.

వీరందరినీ తమ వైపు తిప్పుకుంటే జనసేన, టిడిపి సగం పని పూర్తి చేసినట్లే.

"""/"/ రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంకు వీరే ఉన్నారు కానీ వీరందరినీ పోలింగ్ బూత్ వైపు తరలించడం కష్టమైన పని.

కానీ ఇదే కానీ కనుక వారు విజయవంతంగా చేయగలిగితే వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది.

మాస్ ఓటింగ్ రాబట్టాలని పేదలపై దృష్టి పెడితే చివరికి ఒరిగేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు.

జగన్ పథకాలకు అలవాటు పడిపోయిన వీరు అతనిని వదిలి రావడం చాలా కష్టం.

కానీ మధ్యతరగతి వారికి మాత్రం కాస్త భరోసా ఇస్తే ఓటు బ్యాంకును నింపేస్తారు.

మరి ఈ విధంగా టిడిపి జనసేన పార్టీలు అడుగేస్తాయో లేదో చూడాలి.! .

ఎలిమినేట్ అయిన యష్మీ గౌడ..12 వారాలకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?