విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులపై జనసేన కార్యకర్తల దాడి..!!

మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నం వేదికగా "విశాఖ గర్జన" కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

వర్షం పడుతున్న గాని ఈ కార్యక్రమానికి జనాలు పోటెత్తారు.దాదాపు 3 కిలోమీటర్ల మేరకు జనం రావడంతో.

ఈ కార్యక్రమం జాతీయ మీడియాలో సైతం ప్రసారమైంది.ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ మంత్రులపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు రాళ్ల దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

 మంత్రి రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది.

/ Br """/"/ ఈ ఘటనలో మంత్రి జోగి రమేష్ గారు ధ్వంసం అయింది.

సరిగ్గా ఇదే టైములో విశాఖపట్నం కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోవటంతో విశాఖ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

 అంతకుముందు విశాఖ గర్జనకు సంబంధించి సోషల్ మీడియాలో పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇదే సమయంలో అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా పవన్ మద్దతు తెలపడం తెలిసిందే.

ఇలాంటి తరుణంలో మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమంలో వైసీపీ మంత్రులపై జనసేన దాడి చేయడం రాజకీయంగా సంచలనం రేపుతుంది.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..