టార్గెట్ పవన్ – ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి

తెల్లారి లేస్తే రెండు చోట్లా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పై విమర్శలు చేస్తుంటారు అధికారి పార్టీ నేతలు ,,అంతేకాకుండా కేవలం చంద్రబాబు( Chandrababu ) నాయుడుని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఆయన రాజకీయాలు చేస్తాడని ,ఆయన పోలిటిక్స్ ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన ఒక పార్ట్ టైం పొలిటిషన్ అని రాజకీయంగా సీరియస్నెస్ లేదని అనేక విమర్శలు చేస్తుంటారు.

అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఏదైనాకార్యక్రమం తల పెట్టినా ఎమ్మెల్యేలు నుంచి మంత్రుల వరకూ వరుసపెట్టి ప్రెస్మీట్లు పెట్టి మరీ ఆయన విమర్శలను ఖండిస్తారు .

నిజంగా పవన్ పార్ట్ టైం పొలిటిషన్ అయితే అధికార పక్ష నేతలు ఇంతగా ఎందుకుఉలిక్కిపడతారో అర్థం కాని విషయం.

"""/" / ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాల కేంద్రం గా వారాహి యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిమిషాల వ్యవధిలో ఖండిస్తున్న అధికార పార్టీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే పవన్ రాజకీయ అడుగుల పట్ల అధికార పార్టీ ఎంత అప్రమత్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆయన షెడ్యూల్ను మినిట్ టు మినిట్ ఫాలో అవుతున్న అధికార పార్టీ నేతలు ( Leaders Of The Ruling Party )ఎప్పటికప్పుడు ఆయన విమర్శలకు వంతుల వారిగా కౌంటర్లు రెడీ చేసుకుంటున్నారు.

నిజంగా రాష్ట్ర ప్రజల మీద పవన్ చూపించే ప్రభావం ఏమీ లేకపోతే అధికార పార్టీ ఈ స్థాయిలో అప్రమత్తం అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు.

యువగలం పేరుతో నెలలు తరబడి పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై పౌర్ణమికొ అమావాస్యకొ మాత్రమే విమర్శలు చేసే అధికార పక్ష నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాత్రం గంటల వ్యవధిలోనే రిప్లై ఇస్తూ ఉంటారు.

"""/" / తద్వారా రాజకీయం గా పవన్ తమకు ఎంత ప్రమాదకరమైన ప్రత్యర్థో అధికార పక్ష నేతలు చెప్పకనే చెబుతున్నట్లుంది.

తన పార్ట్ టైమ్ పోలిటిక్స్ తోనే ఈ స్థాయిలో ముద్ర వేస్తున్న పవన్ పూర్తి స్థాయి రాజకీయ రంగం లో ఉంటే మాత్రం ఆంధ్ర పొలిటీక లెక్కలు మార్చేసే అవకసం ఉందని చెప్పవచ్చు .

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ ను దూరం చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!