అమలాపురం ఘటనకు కారకులెవరో చెప్పిన మంత్రులు ! ?

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్ళ తో పాటు, బస్సులను దహనం చేసిన ఘట్టంతో అమలాపురం లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ  జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన కాస్త ఈ విధంగా ఉద్రిక్తం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి.

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు స్పందించారు.ఈ ఘటన వెనుక ఉన్న వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదంటూ ఏపీ మంత్రులు ఆదిమూలపు సురేష్,  దాడిశెట్టి రాజా మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా ముఖంగా ప్రకటించారు.

  మంత్రి విశ్వరూప్ , ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లను దహనం చేసిన ఘటనను తాము ఖండిస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.

కోనసీమ జిల్లాకు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ ఆందోళనకారుల ముసుగులో ఉన్న  సంఘ విద్రోహ శక్తులు ఈ విధ్వంసానికి పాల్పడినట్లు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు ఇతర సంఘ విద్రోహ శక్తులు ఈ వ్యవహారంలో ఎవరది తప్పయినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని , ఇప్పటికే దీనిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న అని మంత్రి వివరించారు.

దళితుల మధ్య,  కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది కుట్రపూరితంగా ఈ దారుణాలకు పాల్పడ్డారని,  వారి పేర్లను బయటపెడతామని మంత్రి ప్రకటించారు.

  """/" / కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు అనే విషయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ గుర్తు చేశారు .

ప్రజల కోరిక మేరకు పేరు మారిస్తే   రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం టిడిపి,  జనసేన ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో అమలాపురం లో జరిగిన విధ్వంసకాండ వెనుక టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని మంత్రి దాడిశెట్టి రాజా  ఆరోపించారు.

కోనసీమ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ జనసేన తో సహా అన్ని పార్టీలు కోరాయని, ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారని, అసలు ఏపీకి ప్రధాన విలన్ టిడిపి అధినేత చంద్రబాబు అంటూ మంత్రులు మండిపడ్డారు.

ముమ్మాటికి ఈ ఘటన వెనక టిడిపి అధినేత చంద్రబాబు ఉన్నారంటూ మంత్రులు ఆరోపించారు.

ఏపీలో కూటమి గెలుపు కష్టమే.. నిరాశలో విపక్ష పార్టీల క్యాడర్..!!