ముంబై ఆస్పత్రిలో ఏపీ మంత్రి పినిపేకు ఆపరేషన్..!

ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనకు గుండెకి సంబంధించిన ఆపరేషన్ ను వైద్యులు నిర్వహిస్తున్నారు.ఈనెల 2న వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగా రాజమండ్రిలో తర్వాత హైదరాబాదులో వైద్యం చేయించుకున్నారు.కానీ కొన్ని రోజుల వ్యవధిలోనే మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో పినిపే ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ అవసరమని సూచించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వరూప్ కు వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి .. ఇట్లు మీ చిరంజీవి