రాజీనామాకు రాజు గారు రె’ఢీ’ ? వైసీపీ రె’ఢీ’నా ? 

సొంత పార్టీలోనేేే ఉంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న నరసాపురం వైైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు నిత్యం ఏదో ఒక ఈ రకంగా సొంత పార్టీ నేతలను విమర్శిస్తూ, వార్తల్లో ఉంటూ వస్తున్నారు.

ప్రతిపక్షం తెలుగుదేేేశ పార్టీ తరహాలో వైసీపీని అధినేత జగన్ ను విమర్శిస్తూ, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ, విమర్శలు చేస్తున్నారు.

వైసీపీ లో గెలిచిన దగ్గర నుంచి వేరే రకంగా రఘురామకృష్ణం రాజు పార్టీపై విమర్శలు చేస్తున్నా వైసీపీ నుంచి పెద్దగా రియాక్షన్ అయితే కనిపించడంలేదు.

రాజుగారు పదే పదే విమర్శలు చేయడం వైసిపికి ఇబ్బందికరంగా మారింది.రాజుగారి విమర్శలను పట్టించుకోనట్టుగా చూస్తూ ఊరుకుంటే, దానికి కౌంటర్ ఇవ్వకపోతే జనాల్లో చులకన అవుతాము అనే అభిప్రాయంతో ఇప్పుడు ఆయన పైన వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు పై దృష్టిపెట్టింది.

రఘురామకృష్ణంరాజు బీజేపీ అండదండలు ఉండడంతో ఇంత ధైర్యంగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ భావించింది.

అయితే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రఘురామ కృష్ణం రాజు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ను బ్లాక్ షీప్ అంటూ విమర్శలు చేసారు.ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని రామచంద్ర రెడ్డి సవాల్ చేశారు.

ఈ వ్యాఖ్యల పైన రఘురామకృష్ణంరాజు ఘాటుగా స్పందించారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన విమర్శలను తాను స్వీకరిస్తున్నాని అని , వారు చెప్పిన విధంగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, తాను మళ్లీ ఎన్నికలలో గెలిస్తే జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్ళాలి అంటూ చాలెంజ్ విసిరారు.

"""/"/ తనంతట తాను వైసీపీలో చేరలేదు అని, తన కాళ్ళు పట్టుకుని బతిమిలాడితేనే తాను వైసీపీలో చేరాను అని రఘురామకృష్ణమరాజు చెప్పుకొచ్చారు.

తాను ఎప్పుడూ జగన్ వ్యక్తిగతంగా విమర్శించలేదని, కేవలం వైసీపీ ప్రభుత్వ విధానాలను తప్పు పడుతున్నాను అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

అయితే రాజు గారి సవాల్ కు వైసీపీ స్పందిస్తుందో లేక ఎప్పటిలాగే లైట్ తీసుకుంటారో చూడాలి.

దేవర సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇవ్వమని డబ్బులు ఇచ్చారు….పూల చొక్కా నవీన్ షాకింగ్ కామెంట్స్!