చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే..: మంత్రి కాకాణి
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) వ్యాఖ్యలపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Minister Kakani Govardhan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబు రా కదలి రా అంటుంటే ఎవరూ రావడం లేదని విమర్శించారు.చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని మంత్రి కాకాణి ఆరోపించారు.
చంద్రబాబును మించిన దొంగ రాష్ట్రంలో ఎవరూ లేరన్నారు.చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని కోర్టులు చెప్పలేదన్న ఆయన సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు.
"""/" /
సాంకేతిక కారణాలతో ఊరట పొందుతున్నారని చెప్పారు.అమరావతి రాజధాని( Amaravati Capital ) పేరుతో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని ఏనాడూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో టీడీపీ హయాంలో ఏం చేశారో వైసీపీ హయాంలో ఏం చేశామో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
అక్కడ ఫ్రీ ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించిన ఉపాసన.. ఎంతో సంతోషంగా ఉందంటూ?