గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) తాజాగా నటించిన చిత్రం గేమ్ చేంజర్.
( Game Changer ) శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే.
ఇందులో అంజలి కియారా అద్వానీలు హీరోయిన్ లుగా నటించారు.ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.
దానికి తోడు మౌత్ నెగిటివ్గా రావడంతో చాలావరకు ఈ సినిమాకు వెళ్లడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు.
ఇది చాలదు అన్నట్టు ఈ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ లోని లోకల్ టీవీలో( AP Local TV ) ప్రసారమైన విషయం తెలిసిందే.
"""/" /
ఎండి అప్పలరాజు నేతృత్వంలో పైరసీ చేసి ప్రదర్శిస్తున్నారు.దీనిపై గేమ్ చేంజర్ చిత్ర బృందం ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విశాఖపట్టణం కమీషనర్ కు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.
దీంతో గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్ ఏపీ లోకల్ టీవీపై దాడులు నిర్వహించింది.
గేమ్ ఛేంజర్ మూవీని పైరసీ( Game Changer Piracy ) చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యడంతో పాటుగా అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎఫ్ఐఆర్ 22 / 2022 కింద నమోదు చేసి అరెస్టు కూడా చేశారు.
ఆ తర్వాత మళ్లీ గేమ్ చేంజర్ సినిమాను ఒక బస్సులో కూడా ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
దీంతో అలాంటి వారిపై మూవీ మేకర్స్ మండిపడడంతో పాటు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.
"""/" /
ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ సినిమాలో రామ్ చరణ్ అలాగే అంజలీల నటన ప్రేక్షకులను బాగా మెప్పించింది.
సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారని చెప్పాలి.
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేయడంతో పాటు యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ ని కూడా రాబట్టాయి.
అయితే త్వరలోనే ఈ సినిమా ఓటీటీ లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!