ఏపీలో స్థానిక ఎన్నికల నగారా మోగనుంది! మూడు రోజుల్లో నోటిఫికేషన్?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మొగనుంది.ప్రభుత్వం ఇచ్చిన 59 శాతం రిజర్వేషన్ లని 50 శాతం మించకుండా హైకోర్టు తీర్పు చెప్పడంతో పాటు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకి దూకుంది.

ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించి ఈ నెలాఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులందరికీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

14 ఫైనాన్స్ నిధులు రావాల్సి ఉండటంతో వాటిని వీలైనంత వేగంగా తెచ్చుకోవాలని, దీనికి నెలలోగా ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా ఎన్నికల సంఘం ఇంకా ఖరారు చేయకపోయినా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే కొన్ని తేదీలని కమిషన్ కి పంపించినట్లు తెలుస్తుంది.

ఇక వీటిపై ముఖ్యమంత్రి జగన్ తుది నిర్ణయం రాగానే ఎన్నికల సంఘం కూడా ఇవే తేదీలని అధికారికంగా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 7న మండల, జిలా పరిషత్ లకి, 10న మున్సిపాలిటీలకి, 15న పంచాయితీలకి జరీ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఎంపీటీసీ,జడ్పీటీసీ లకి 21, మునిసిపాలిటీ -24న, గ్రామ పంచాయితీ -27న పోలింగ్ నిర్వహించి 30,31 నాటికి ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

వీటిని అధికారులు ఇప్పటికే సిద్ధం చేయగా ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాత ఎన్నికల సంఘం కన్ఫర్మ్ చేస్తుందని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఓటుకు నోటు కేసు: నేడు సుప్రీం కోర్టులో విచారణ