ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వ్యాఖ్యలు

ఏపీలో జీతభత్యాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు అన్నారు.

ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు.బకాయిలు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని మండిపడ్డారు.

సీపీఎస్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హామీ ఏమైందని ప్రశ్నించారు.ఉద్యమం చేస్తున్న టీచర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

ఈ నేపథ్యంలో రేపు కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తామని వెల్లడించారు.అదేవిధంగా మూడవ దశ ఉద్యమాన్ని సిక్కోలు నుంచి ప్రారంభిస్తామన్నారు.

ఈనెల 9న శ్రీకాకుళంలో ఉద్యోగుల ఆత్మీయ సదస్సు జరుగుతుందని తెలిపారు.

ఆ కంటెస్టెంట్ కు బాగా నోటిదురుసు.. నయని పావని షాకింగ్ కామెంట్స్ వైరల్!