మంత్రుల క‌మిటీ భేటీకి ఏపీ జేఏసీ అమ‌రావ‌తి దూరం

సీపీఎస్ అంశంపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల క‌మిటీ స‌మావేశాన్ని ఏపీ జేఏసీ అమ‌రావ‌తి బ‌హిష్క‌రించింది.

జీపీఎస్ అమలుకి వ్య‌తిరేక‌మ‌ని ఇప్ప‌టికే అనేక సార్లు జ‌రిగిన స‌మావేశాల్లో స్పష్టం చేశామ‌ని ఏపీ జేఏసీ అమ‌రావ‌తి ఛైర్మ‌న్ బొప్ప‌రాజు తెలిపారు.

ఇన్ని చ‌ర్చ‌ల త‌ర్వాత కూడా ప్ర‌భుత్వం సీపీఎస్ అంశంపై స‌మావేశం ఏర్పాటు చేయ‌డంతో హాజ‌రుకాకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిపారు.

భవిష్య‌త్ లో జ‌రిగే స‌మావేశాలు ఓపీఎస్ అయితేనే చ‌ర్చల‌కు సిద్ధ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

సీఎం జ‌గ‌న్ హామీకి క‌ట్టుబడి పాత పింఛ‌న్ విధానాన్నే అమ‌ల్లోకి తేవాల‌ని కోరారు.

వీడియో: అర్ధరాత్రి ఇంట్లోకి దూరిన చిరుత.. కోడిని ఎలా పట్టేసిందో చూస్తే..