ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్..!!
TeluguStop.com
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది.2022 మార్చి 15 నుండి మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపీ ఇంటర్ బోర్డు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది.
మార్చి 15వ తారీకు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి.
అలాగే మార్చి 16వ తారీకు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.
"""/" /
ఏప్రిల్ నుండి మే రెండో వారం వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
కాగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష మాత్రం ఫిబ్రవరి 22వ తారీకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు.
ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది.
ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్ లలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్నారు.
‘తలుపు వెయ్ బ్రదర్!’ ఓయో లవర్స్ ఘాటు రొమాన్స్.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..