SGT Posts : ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులకు అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification In AP ) ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను( BED Candidates ) కూడా అనుమతించింది.

అయితే ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్ పై స్టే విధించింది.

ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు.దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.

ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!