ఎంపీ రఘురామ కృష్ణరాజుకి ఏపీ హైకోర్టు షాక్..!!

జూలై 4న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమాలు భీమవరం మరియు విశాఖపట్నంలో జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్నరు.దాదాపు 2000 మంది పోలీసులకు పైగా .

భద్రతగా ఉంటున్నారు."ఆజాదీకా అమృత్ మహోత్సావ్" వేడుకలలో భాగంగా అల్లూరి జయంతి వేడుకలను కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

అయితే ఈ వేడుకలకు రావడానికి ఇప్పటికే .వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్ని భద్రత ఏర్పాట్లు  చేసుకోవడం తెలిసింది.

తనపై సీఐడీ కేసుకు సంబంధించి కూడా ఎక్కడ ఏటువంటి అరెస్టు కార్యక్రమాలు జరగకుండా కోర్టు అనుమతి ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇటువంటి తరుణంలో ఒక విషయంలో మాత్రం రఘురామకృష్ణ రాజుకి ఏపీ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.

భీమవరంలో తన హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి అనుమతి ఇవ్వాలని అభ్యర్థనను హైకోర్టుతో తోసిపుచ్చింది.

ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేయలేము అని తెలిపింది.అయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉన్నందున రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని రఘురామరాజు న్యాయవాది కోరగా ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున.

పోలీసుల భద్రతకు తాము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడం జరిగింది.అయితే శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా చూడాలని కోర్టు ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

పావురాలను ఉపయోగించి 50 ఇళ్లను దోచుకున్న దొంగ..