మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు సీఆర్‌డీఏ ను రద్దు చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో అమరావతి ప్రాంత రైతులు మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.

దాంతో ఈ కేసు విచారణ పూర్తి అయ్యే వరకు అమరావతి రాజధాని మార్పుతో పాటు సీఆర్‌డీఏ రద్దుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణ పూర్తి అయ్యే వరకు ఆ విషయాలపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ప్రభుత్వంకు హైకోర్టు సుచించింది.

దాంతో మూడు రాజధానుల విషయమై ప్రభుత్వం ముందుకు వెళ్లలేని పరిస్థితి.ఇప్పటికే మండలిలో ఈ బిల్లు ఆగిపోయింది.

ఇదే సమయంలో హై కోర్టు కూడా ఇలా బ్రేక్‌ వేయడంతో జగన్‌ ప్రభుత్వం పెద్ద సంకటంలో పడ్డట్లయ్యింది.

మూడు రాజధానుల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.కొందరు మద్దతుగా కొందరు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు.

ఓటుకు నోటు కేసు: నేడు సుప్రీం కోర్టులో విచారణ