కరోనా అంత్యక్రియలకు రూ.15 వేలు : ఏపీ ఆరోగ్య శాఖ

రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిలో మార్పు లేదు.

కరోనా యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు సంఖ్యను పెంచడంతో రోజూ వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

వైరస్ సోకిన వారికి వైద్యసేవలు అందిస్తోంది ప్రభుత్వం.ఆస్పత్రిలో, హోం క్వారంటైన్లలో కరోనా కిట్లను అందజేస్తుంది.

బెడ్ల సంఖ్యను పెంచింది.కఠిన నిబంధనలను అమలు చేస్తుంది.

ఈ నెలలో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మెరుగైన సౌకర్యాల ఏర్పట్ల కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు వెల్లడించింది.ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం అర్ధరాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

ఇందులో కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు అందించనుంది.

కరోనాను నిర్మూలించడానికి ప్లాస్మా అవసరం కాబట్టి ప్లాస్మాదాతలకు రూ.5 వేలు అందించనున్నట్లు ప్రభుత్వం ఆమోదించింది.

ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల అమలుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.కాగా, ఈ డబ్బును కుటుంబసభ్యులకు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దీనికి అవసరమైన నిధులు ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయం విడుదల చేయనుంది.

చిన్న వయసులోనే వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయిందా.. డోంట్ వర్రీ ఈ టిప్స్ మీకోసమే!